భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

  • పీబుల్, క్యూలోజ్, మేయర్ లకు నోబెల్
  • ఫిజిక్స్ లో సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు
  • దశాబ్దాల కృషి ఫలితం
ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రపంచప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. నాటి బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఇప్పటివరకు విశ్వం తీరుతెన్నులను మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్థాంతీకరించిన జేమ్స్ పీబుల్ ను నోబెల్ కు ఎంపిక చేశారు. సౌర వ్యవస్థకు ఆవల ఓ సూర్యుడి వంటి నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాన్ని కనుగొన్నందుకు మైకేల్ మేయర్, దిదీయర్ క్యూలోజ్ లను కూడా నోబెల్ ప్రైజ్ వరించింది. నిన్న వైద్యరంగంలో ముగ్గురిని నోబెల్ కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Nobel
Prize
Physics

More Telugu News